కడప జిల్లా, కాశినాయన మండలం – 2025 సెప్టెంబర్ 4
కాశినాయన మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన బారగజ్జి మహబూబ్ పీరా (23) అనే యువకుడు గురువారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు.
అంబులెన్స్ వేళ్లేనందున, మహబూబ్ పీరాను సొంత వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. “ఆ సమయంలో ఆక్సిజన్ అందించి ఉంటే ప్రాణాలతో ఉండేవాడు,” అని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ, “ప్రజల సేవ కోసమే ఉన్న 108 సిబ్బంది మాకు లేఖ తేవాలంటూ మాట్లాడారు, అది మనసును కలచేసేలా ఉంది,” అని తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది, ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ చనిపోయాడు అని వారు వాపోయారు.
ఘటనపై స్పందించిన కడప జిల్లా DMHO నాగరాజు గారు, వెంటనే విచారణ ప్రారంభించారు. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను, సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్ సుధాకర్ వద్ద మొదట వైద్యం తీసుకున్న విషయాన్ని కూడా విచారించనున్నట్టు తెలిపారు.