కొమరోలు మండలం, తాటిచెర్ల పంచాయతీ – హసనాపురం గ్రామం:
హసనాపురం గ్రామానికి చెందిన కూకుట్ల భూపాల్ గారి సతీమణి, కుటుంబాన్ని పోషించేందుకు కూలిపనులకు వెళ్లే క్రమంలో, ఇటీవల రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై తిరిగి వస్తున్న సమయంలో ఆటోతో జరిగిన యాక్సిడెంట్‌లో ఆమె కాలు పూర్తిగా విరిగిపోయింది. స్థానికులు ఆమెను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు తీవ్రతను గుర్తించి ఒక కాలు పూర్తిగా తొలగించాల్సి వచ్చింది.
ఈ విషాదకర పరిస్థితిని గమనించిన గ్రామస్తులు, బాధిత కుటుంబ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని, అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు గారిని సంప్రదించి ఆర్థిక సాయం చేయవలసిందిగా అభ్యర్థించారు.
గ్రామస్తుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని, డాక్టర్ బోనేని వెంటనే స్పందించి ₹10,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, గురువారం రోజున గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి, కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మెరుగైన వైద్యం కోసం ధైర్యం కూడా చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
డా. బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ – అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
పందనబోయిన భూపాల్ – ఫౌండేషన్ సెక్రటరీ
బోనేని అనిల్ కుమార్
గ్రామస్తులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది
కృతజ్ఞతలు:
బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు వైద్యులు, అమ్మ ఫౌండేషన్ కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.