ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు రానుండటంతో అనంతపురం నగర పరిధిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అనంతపురం–బెంగళూరు జాతీయ రహదారి వద్ద టాటా మోటార్స్ ఎదురుగా నిర్మిస్తున్న రెండు హెలిప్యాడ్‌లను అధికారులు పరిశీలించారు.
ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి (IAS), జిల్లా ఎస్పీ పి. జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. మ్యాప్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం పలు సూచనలు జారీ చేశారు. హెలిప్యాడ్ చుట్టూ ఉన్న రేకుల షెడ్లు తొలగించాలని, అదనంగా మట్టి వేసి రోల్ చేసి తగినంత నీటిపారుదల చేయాలని అధికారులకు సూచించారు. అన్ని పనులను శనివారం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేశవ నాయుడు, ఆర్ & బి ఎస్ఈ మురళీకృష్ణ, ఈఈ రాజగోపాల్, డిఈ కాటమయ్య, తహసిల్దార్ హరికుమార్, మండల సర్వేయర్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.