Tv424x7
AndhrapradeshPolitical

ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు….

ఒకరోజు పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు తిరుగు పయనంలో ప్ర‌జా ప్ర‌తినిధులు, జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు.

శుక్రవారం ఉదయం హోటల్ రాడిసన్ బ్లూ లో జరిగిన ACIAM ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం 11-45 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ.నారా చంద్రబాబు నాయుడు ఋషికొండ హెలిపాడ్ చేరుకున్నారు.

ముఖ్యమంత్రికి ఋషికొండ హెలిపాడ్ వద్ద జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్, ప్ర‌భుత్వ విప్ గ‌ణ‌బాబు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాస‌రావు, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికాారు.

ఋషికొండ హెలిపాడ్ నుండి 11-50 గంటలకు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌరవ.నారా చంద్రబాబు నాయుడు, ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాకు తిరుగు పయనమయ్యారు.

Related posts

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

TV4-24X7 News

పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

TV4-24X7 News

ఢిల్లీకి వెళ్తావా జగన్!. పద నేనూ వస్తా….!

TV4-24X7 News

Leave a Comment