అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు – నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు విడివిడిగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించేందుకు వివిధ బిల్లులకు, చట్ట సవరణలకు ఇప్పటికే మంత్రి వర్గ సమావేశాల్లో ఆమోదం తెలిపారు. సామజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఇందుకు అనుగుణంగా నిబంధనల రూపకల్పనకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని తీసుకువస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. అటు పులివెందుల ఎమ్మెల్యే జగన్తో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిం.