ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ, పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రేపు (ఆదివారం) మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఆలయ ఈఓ బాబు తెలిపారు.
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.