కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని మద్దిరెడ్డిపల్లి గ్రామ నివాసి అయిన యాదవ కులానికి చెందిన లక్ష్మీదేవి, వయస్సు 50సం//లు,. ఈమెకు కాలికి చిన్న దెబ్బతగిలి, బొబ్బలు వచ్చి, షుగర్ వల్ల , ఆ గాయానికి పురుగులు పడటం వలన , కాలు బాగా చెడిపోయింది. అందువల్ల డాక్టర్ కాలు క్రింది భాగాన్ని తొలగించారు. ఈమెకు తల్లిదండ్రులు, భర్త & పిల్లలు ఎవ్వరూ లేరు. అందువల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మందులకు మరియు పూట గడవడానికి కష్టంగా ఉండడంతో గ్రామస్తులు ఫోన్ ద్వారా సిఐ జయలక్ష్మి కి సమాచారం ఇవ్వడంతో సిఐ విజయలక్ష్మి మానవ దృక్పథంతో మానవసేవే మాధవ సేవ గా భావించి RS4000/నగదు,ఒక వెయ్యి రూపాయలు వంటసరుకులు* వారి తండ్రి లెక్కల సిద్ధారెడ్డి చేతుల మీదుగా లక్ష్మీదేవి ఇంటిదగ్గర అందించడం జరిగినది. నిజంగా అవసరం ఉండి, ఎవరైనా సాయం చేస్తారా… అని ఎదురుచూస్తున్న వారికి నాకు చేతనైనంత సహాయం చేస్తాను అని ఆమె తెలిపారు

previous post