Tv424x7
Telangana

తల్లి హృదయ విదారక నిర్ణయం.. ఇద్దరు పిల్లలతో విషాదాంతం..

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి హతమార్చిన తల్లి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది.పుట్టింట్లో ప్రేమల, పిల్లల మృతదేహాలు. పిల్లల్ని కనేప్పుడు తల్లి పునర్జన్మ ఎత్తుతుందంటారు.

పండంటి ఇద్దరు పిల్లలను కనడం ద్వారా ఆ మాతృమూర్తి రెండుసార్లు పునర్జన్మ ఎత్తింది. అత్యంత తీవ్రంగా బాధించే పురిటినొప్పులనే తట్టుకున్న ఆమెకు అంతకు మించి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. పేగు తెంచుకొని పుట్టిన ఇద్దరు ముక్కుపచ్చలారని కుమారులను తన చేత్తోనే పీక నులిమి ప్రాణం తీసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి చూసేందుకు వచ్చిన బంధువులు, గ్రామస్థులు ‘భరించలేని కష్టమొచ్చింది సరేనమ్మా..

పిల్లలను చంపేందుకు చేతులెలా వచ్చాయి తల్లీ.. వారి కోసమైనా ఆ బాధలు భరించలేకపోతివా’ అని కన్నీటి సంద్రమయ్యారు.పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన బూషి ప్రేమల(22) దామరచెరువుకు చెందిన కొత్తపల్లి సంగమేశ్వర్‌లకు మూడున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ధనుష్‌(3), సూర్యవంశీ(45 రోజులు) సంతానం.

ప్రేమలకు రెండో కుమారుడు జన్మించిన అనంతరం ఇటీవల అత్తారింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం నిజాంపేట్‌లోని పుట్టింటికి పిల్లలతో సహా వచ్చింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు కుమారుల గొంతు నులిమి చంపేసి.. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ఈ విషాద ఘటనకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related posts

ఒకటి కాదు, రెండు కాదు పది ప్రభుత్వ ఉద్యోగాలు

TV4-24X7 News

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్జిస్ సంజీవ్ ఖన్నా?

TV4-24X7 News

వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్

TV4-24X7 News

Leave a Comment