మేలియాయిడోసిస్
👉 ప్రపంచ అలర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు, ప్రముఖ ఇమ్మ్యూనాలజిస్ట్ & పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ కీలక హెచ్చరికలు జారీ చేశారు.
🔴 హై రిస్క్ గ్రూపులు:
డయాబెటిస్ పేషెంట్లు
అధిక మద్యం సేవించేవారు
రైతులు, కట్టడ పనివారు
శానిటరీ, వెటర్నరీ సిబ్బంది
ఇమ్యూనిటీ తగ్గినవారు
🔬 వ్యాధి కారణం:
కలుషిత భూమి, నీటిలో ఉండే Burkholderia pseudomallei అనే ప్రమాదకర బ్యాక్టీరియా. గాయాలు, శ్వాస, కలుషిత ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
⚠️ లక్షణాలు:
జ్వరం
ఊపిరితిత్తుల న్యుమోనియా
చర్మంపై పుండ్లు, చీము పట్టడం
ఎముకలు, కీళ్ల నొప్పి
తలనొప్పి, కడుపు నొప్పి
తీవ్రమైన దశలో రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్టీసీమియా)
💊 చికిత్స:
ఇంటెన్సివ్ ఫేజ్: IV యాంటీబయోటిక్ థెరపీ
ఇరాడికేషన్ ఫేజ్: దీర్ఘకాలం ఓరల్ యాంటీబయోటిక్స్
🌍 వియత్నాంలో 1966లో ఈ వ్యాధి మహా విధ్వంసం సృష్టించడంతో దీనిని “వియత్నాం టైం బాంబ్” అని పిలిచారు.
🚨 డాక్టర్ వ్యాకరణం హెచ్చరిక:
“ఈ వ్యాధి కట్టడి చేయకపోతే, ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రజలు, ఆరోగ్య శాఖలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
అనూష