రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన వేడుకలు ఘర్షణకు దారి తీసాయి.
కాంగ్రెస్ – బిఆర్ఎస్ మద్దతుదారుల మధ్య డీజే – బ్యాండు వివాదం చెలరేగింది.పరస్పర దాడుల్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కర్రోళ్ల సురేందర్ గాయపడ్డారు.బ్యాండు డప్పు ధ్వంసం అయ్యింది.
పోలీసులు వేడుక చూస్తూ ఉన్నారనే ఆరోపణలు భక్తులవైపు నుంచి వినిపించాయి.తర్వాతే కేసు నమోదు చేసి గుంపులను చెదరగొట్టారు.అయితే పోలీసులు ఒకే వర్గానికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
👉 సైబరాబాద్ కమిషనర్ ఇప్పటికే డీజేకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చినా, కొత్తూరులో ఎలా వేశారు? అనే ప్రశ్నలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి
అనూష