Tv424x7
National

జీఎస్టీ రేషనలైజేషన్ – చర్చ అంతా కార్ల గురించే!

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రజలకు డబ్బులు మిగులుతాయని అందరూ అంటున్నారు. అయితే ఎక్కువగా జరుగుతున్న చర్చ మాత్రం కార్ల గురించే. కార్లపై చాలా ఎక్కువగా డిస్కౌంట్లు వస్తున్నాయని చర్చించుకుటంున్నారు.

కార్లపై ప్రస్తుతం 28% ఉన్న అత్యధిక జీఎస్టీ స్లాబ్‌ను 18%కి తగ్గిస్తున్నారు. అదనంగా విధించే 1% నుంచి 22% వరకు ఉన్న కాంపెన్సేషన్ సెస్‌ను కూడా రద్దు చేస్తున్నారు. ఇంజన్ సామర్థ్యం , వాహన పరిమాణం ఆధారంగా 29% నుంచి 50% వరకు పన్ను విధించే కార్లు కూడా ఉన్నాయి.

చిన్న పెట్రోల్ కార్లపై 29% పన్ను ఉండగా, ఎస్‌యూవీలపై 50% వరకు పన్ను ఉంది. కొత్త జీఎస్టీ రేషనలైజేషన్ ప్రతిపాదనల ప్రకారం, చిన్న కార్లపై 1200 సీసీ కంటే తక్కువ పెట్రోల్, 1500 సీసీ కంటే తక్కువ డీజిల్ కార్లపై జీఎస్టీ 18%కి తగ్గనుంది. లగ్జరీ వాహనాలపై 40% ప్రత్యేక రేటు అమలు చేస్తారు. ఈ మార్పులు చిన్న కార్ల ధరలను 8% వరకు, పెద్ద కార్ల ధరలను 3-5% వరకు తగ్గిస్తాయని ఆటోమోబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ రేటు తగ్గింపు వల్ల మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు గణనీయమైన ప్రయోజనం పొందనున్నాయి. మారుతి సుజుకి, దాదాపు 68% విక్రయాలు చిన్న కార్ల విభాగంలో ఉండటం వల్ల ఈ సంస్కరణల నుంచి అత్యధిక లాభం పొందే అవకాశం ఉంది. ఆటోమొబైల్ విక్రయాలను పెంచడం ద్వారా తయారీ రంగాన్ని ఉత్తేజపరుస్తాయి. ఫలితంగా, ఫ్యాక్టరీలు, డీలర్‌షిప్‌లు, అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బ్యాంకులు , ఎన్‌బీఎఫ్‌సీలకు క్రెడిట్ వృద్ధి కూడా మెరుగుపడుతుంది.

జీఎస్టీ రేషనలైజేషన్ ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక గేమ్-ఛేంజర్‌గా మారనుంది. ధరల తగ్గింపు, డిమాండ్ పెరుగుదల, ఉపాధి అవకాశాల సృష్టి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కార్ల కొనాలనుకున్న వారికి ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. డిమాండ్ పెరుగుతుంది. జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త రేట్లను అమలు చేయనుంది, ఇది దీపావళి సీజన్‌లో వినియోగదారులకు ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌గా మారుతోంది.

Related posts

వేధింపుల నుంచి రక్షణ కోసం చేసిన చట్టాన్ని కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారు: సుప్రీంకోర్టు

TV4-24X7 News

EVM లపై అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డు (Tulasi Gabbard) సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

3,500 ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు?

TV4-24X7 News

Leave a Comment