మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో యూరియా అక్రమ రవాణా ఘటన వెలుగుచూసింది.
బైక్‌పై రెండు యూరియా బస్తాలను తరలిస్తున్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్ర యజమానిని అప్రమత్తమైన పోలీసులు పట్టుకున్నారు. వెంటనే ఈ విషయం గురించి వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రైతుల కోసం ప్రభుత్వం పంపిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించాలనే యత్నం విఫలమైంది. యూరియా బస్తాలను తన షాప్‌లోనే నిల్వ ఉంచిన యజమాని తీరుపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాక, ఇటీవలే నెల్లికుదురులోని పద్మావతి ఫెర్టిలైజర్ షాప్‌లో 220 యూరియా బస్తాలు రాత్రికి రాత్రే మాయం కావడం ఇప్పటికే పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటనలపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్ విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని కోరుతున్నారు.
👉 ఈ తరహా ఘటనలతో రైతులకు కేటాయించిన ఎరువులు వాస్తవంగా వారికీ చేరుతున్నాయా లేదా అన్న అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి.
అనూష