Tv424x7
Telangana

అయ్యో దేవుడా.. అప్పటిదాకా సరదాగా ఉన్న అతను…

గణేష్ నిమజ్జనంలో డీజె సౌండ్ వినేసరికి కాస్త ఊపు తో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి..


సైలెంట్ కిల్లర్.. గుండె పోటు కేసులు నానాటికి పెరుగుతున్నాయి..

ఒకప్పుడు గుండె సమస్యలు కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చేవి అనుకునేవారు..

కానీ, ఇప్పుడు కాలం మారింది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటు అందరి ప్రాణాలు తీస్తోంది..

చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది..

అప్పటివరకు సంతోషంగా తమతో గడిపిన వారు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి..

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జనంలో.. డీజే మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ శేఖర్ అనే వ్యక్తి డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.. సీపీఆర్ చేసిన ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన మరువక ముందే..

ఓ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు.. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో జరిగింది.

ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌ (31) మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివాసం ఉంటున్నాడు.. గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా ఆదివారం ఆనంద్‌బాగ్‌లో నృత్యం చేస్తూ డేవిడ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డేవిడ్ ను పరిక్షించి చికిత్స అందించారు.

ఈ క్రమంలోనే.. అతని పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు డేవిడ్ ను కుటుంబసభ్యులు గాంధీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు డేవిడ్ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, మూడు నెలల పాప ఉందని సీఐ సత్యనారాయణ తెలిపారు..

Related posts

రెండో రోజు ఢిల్లీలో బిజీ బిజీగా రేవంత్ రెడ్డి పర్యటన

TV4-24X7 News

కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం

TV4-24X7 News

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

TV4-24X7 News

Leave a Comment