ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధోరణీ సరి లేదని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కొర్రపాడు రోడ్డు లో ఉన్న కొనిరెడ్డి ఆయిల్ మిల్లు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కి చెందిన కౌన్సిలర్ లను ప్రలోభాలు పెట్టి పార్టీ ఫిరాయింపు కు పాల్పడుతున్నారు అని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కొత్తపల్లి పంచాయతీ లోని పలువురు వార్డు సభ్యులను ఎమ్మెల్యే హోదాలో కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా అని తెలిపారు. ప్రొద్దుటూరు వైసిపి టికేట్ ఎవరికీ కేటాయించలేదని ఒకవేళ రాచమల్లు కు కేటాయిస్తే ఓటమి తప్పదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికేట్ ను నాతో పాటు ఇర్ఫాన్, రమేష్ యాదవ్, మురళీధర్ రెడ్డి లు కూడా ఆశిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో 13 వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్, వెల్లాల భాస్కర్, చిలకల కృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

previous post