కళాజాతా వీధి నాటకంతో యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన

కళాజాతా వీధి నాటకంతో యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

రైల్వే కోడూరు: యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కళాజాతా వీధి నాటకం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బ్రహ్మకుమారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.రైల్వే కోడూరు పట్టణంలోని రంగనాయకులపేట, బాలానగర్, సాయినగర్ ప్రాంతాలతో పాటు సాయి డిగ్రీ కళాశాలలో కళాజాతా, వీధి నాటకం ద్వారా ప్రజలు, విద్యార్థులు, యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు.

హెచ్‌ఐవీ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది.. సంక్రమించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి.. అనే అంశాలను నాటక రూపంలో వివరించారు. అలాగే హెచ్‌ఐవీతో పాటు టీబీ (క్షయవ్యాధి) గురించి, హెచ్‌ఐవీ–టీబీ మధ్య ఉన్న సంబంధం, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు.వ్యాధులపై అపోహలు వీడి, సరైన సమాచారం తెలుసుకోవడంతో పాటు తమ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలని నిర్వాహకులు సూచించారు.ఈ కార్యక్రమంలో పాస్‌ ఎన్‌జీవో సిబ్బంది, ఎల్‌డబ్ల్యూఎస్ రామ సుబ్బారెడ్డి, ఐసీటీసీ కౌన్సిలర్ వాణి, ల్యాబ్ టెక్నీషియన్ చైతన్య, కళాశాల సిబ్బంది, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పెంచలయ్య, కరస్పాండెంట్ పీ. శ్రీనివాసులు, ఆయా ప్రాంతాలకు చెందిన పెద్దలు తదితరులు కార్యక్రమంలో పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *