మైదుకూరులో SIR సమీక్ష సమావేశం
మైదుకూరు: మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి SIR (Special Intensive Revision)పై సమీక్ష సమావేశం శుక్రవారం మైదుకూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ERO కే. మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ, పరిశీలన తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) BLA-1 ఆరవేటి హరికృష్ణతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. SIR ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: