Tv424x7
Andhrapradesh

ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు

.పులివెందుల: గురువారం పట్టణంలోని పులివెందుల ప్రెస్ యూనిటీ కార్యాలయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వేలూరు శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారుకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలి ఆన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రము విడిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కారణంగా రాష్ట్రం అధోగతి పాలైoదన్నారు ఇందుకోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేక హోదా అమలు చేస్తామని హామీ ఇచ్చింది అన్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రత్యేక హోదా తేకపోవడంతో మరింత అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారింది అన్నారు. అలాగే జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో తాగునీటికి సాగుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అని దీనివలన వ్యవసాయ రంగం కూడా కుదేలైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా తెచ్చే శక్తి లేదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేసేందుకు టిడిపి ప్రభుత్వం గాని వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రాంతీయ పార్టీలు బిజెపికి కట్టు బానిసలే అని ప్రజలకు తెలిసింది అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీలు అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా ఈసారి జరగబోయే ఎన్నికలలో ప్రతి పోలింగ్ బూతులోనూ కాంగ్రెస్ ఏజెంట్లను నిలబెడతామన్నారు. వైసీపీ ప్రభుత్వం పరోక్షంగా టిడిపి జనసేన పార్టీలు ప్రత్యక్షంగా బిజెపికి మద్దతు ఇస్తున్న తరుణంలో ప్రజల చూపు కాంగ్రెస్ వైపు ఉంది అన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతుంది అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక వజ్రాయుధం లాంటిదని రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వలన ధరల నియంత్రణ పెద్ద మొత్తంలో పరిశ్రమలు ఏర్పడడం వల్ల ఉపాధి ఏర్పడి నిరుద్యోగ నిర్మూలన అలాగే పెద్ద మొత్తంలో నిధులు సమకూరడం వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తామని రాహుల్ గాంధీ ఇదివరకే ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

Related posts

32వ వార్డు సమస్యలను పరిష్కరించాలి జీవీఎంసీ కమిషనర్ కు కందుల విజ్ఞప్తి

TV4-24X7 News

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి జీవనజ్యోతి భీమా పంపిణి

TV4-24X7 News

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

TV4-24X7 News

Leave a Comment