Tv424x7
Andhrapradesh

జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు అన్నదమ్ముల్లా కలసి పనిచేస్తాం

వైయస్సార్ పార్టీ విజయానికి.. జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు అన్నదమ్ముల్లా కలసి పనిచేస్తాం… మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా అధికారం చేపట్టేందుకు ప్రతి ఒక్కరం అన్నదమ్ముల కలిసిమెలిసి కృషి చేస్తామని వైయస్ఆర్ సీపీ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి లతో కలిసి వైఎస్ఆర్సిపి నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. కొద్దిసేపు జరిగిన చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఒకే కుటుంబ సభ్యులముగా పనిచేస్తున్నామన్నారు. అయితే మాలో వచ్చిన చిన్నచిన్న విభేదాలు , అపోహలను తొలగించుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని అధికారం చేపట్టేందుకు కలిసిమెలిసి అన్నదమ్ముల కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలను సాధించేందుకు అందరం పని చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్న పరిస్థితులు నేడు ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి ఒక భగవద్గీతగాను, ఖురాన్ గాను, బైబిల్ గా భావించారని, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చారని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రకటించనున్న మేనిఫెస్టో కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి పై ప్రజలు విశ్వాసాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలలో చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభల నేపథ్యంలో వస్తున్న ప్రభంజనం చూస్తోంటే రానున్న ఎన్నికల్లో ఘనవిజయాన్ని సూచిస్తుందని తెలిపారు. మేమంతా కలిసికట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కుటుంబ సభ్యుల కష్టపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రజల అవసరాలు, కష్టాలు, సమస్యలు అతి దగ్గర ఉండి చూచి, పేదలకు అండగా నిలిచేందుకు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను తన మేనిఫెస్టోలో రూపొందించి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, హామీని నెరవేర్చారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికిని ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు సంవత్సరాలలో మంచి పరిపాలనను అందిస్తూ పేదవాడు బాగుండాలని, అనేక సంస్కరణలను, అభివృద్ధిని, విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువచ్చిన ఏకైక నాయకుడు దేశంలో ఎక్కడా లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం మాత్రమే అని ప్రజలు గమనించారని, అందుకే బాబుకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నకూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే తన ప్రాణం ఉన్నంతవరకు కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎవరు పార్టీలు మారినా తాను మాత్రం వైఎస్ఆర్సిపి లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి లతో కలిసి పార్టీ విజయానికి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టేందుకు, నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

TV4-24X7 News

నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

TV4-24X7 News

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment