Tv424x7
Andhrapradesh

సైబర్ మోసగాళ్ల వేధింపులకు యువకుడి ఆత్మహత్య చికిత్స పొందుతూ మృతి

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మోతే నాగరాజు (19) అనే యువకుడి నిండు ప్రాణం సైబర్ మోసగాళ్ల వేధింపులకు బలైంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మగ్గిడికి చెందిన యువకుడు నాగరాజు మొబైల్ ఫోన్లో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో గుర్తుతెలియని కొందరు సైబర్ మోసగాళ్లు, ఆ యువకుడుకి ఫోన్ చేసి నిషేధిత యాప్ డౌన్లోడ్ ఎందుకు చేసుకున్నావ్ అని పదేపదే ఫోన్ చేస్తూ ఆ యువకుడుని బెదిరించారు. ఆ గుర్తుతెలియని ఆగంతకులు వారు సిబిఐ అధికారులమని, ఆ యువకుడిని బెదిరిస్తూ నిషేధిత యాప్ డౌన్ లోడ్ చేసుకున్నావని చెబుతూ ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించడం సాగించారు. దీంతో యువకుడు తీవ్ర ఆందోళనకు లోనై ఈనెల 18వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి గడ్డి మందును సేవించాడు. దీంతో ఆ యువకున్ని గమనించిన కుటుంబీకులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జిల్లా కేంద్రంలోని ప్రుడెన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మగ్గిడి గ్రామానికి చెందిన యువకుడు మోతే నాగరాజు పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబర్ యాక్టింగ్ కింద కేసు నమోదు చేసుకుని ఆర్మూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఏపీలో కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

వైఎస్ షర్మిల ఏపీ పర్యటన ఖరారు…ఇదిగో షెడ్యూల్

TV4-24X7 News

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

Leave a Comment