Tv424x7
Andhrapradesh

ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పండి జగన్ కు షర్మిల బహిరంగ లేఖ

అమరావతి: సీఎం జగన్‌ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు..ఈ మేరకు జగన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్‌ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని దుయ్యబట్టారు..”మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్‌ తరఫున ఇదే మా డిమాండ్‌” అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు..

Related posts

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ – 2024

TV4-24X7 News

మహిళను కుటుంబసభ్యుల వద్దకు చేర్చిన కంచరపాలెం పోలీసులు

TV4-24X7 News

బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్…6 ఎకరాల భూమి స్వాహా

TV4-24X7 News

Leave a Comment