విశాఖపట్నం సేవలకు ప్రతిరూపంవాసవి క్లబ్ అనివిశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు.వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని శనివారం ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ నిస్వార్ధ సేవలందిస్తున్న ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తుందన్నారు.ప్రజలకు ఎటువంటి కష్టకాలం వచ్చిన నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి సేవలు అందించడంలో వాసవి క్లబ్ కు మంచి గుర్తింపు ఉందన్నారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ విశాఖ ప్రెసిడెంట్ కంకటాల సతీష్, సెక్రెటరీ ముమ్మిడివరపు విజయ్ కుమార్, ట్రజరర్ పాలూరి వెంకట చిదంబరం, సభ్యులు తీగల రామకృష్ణ, తీగల చిరంజీవి రావు, కె.మాణిక్యాలరావు, పిసిహెచ్ గుప్తా, కె.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

previous post