చంద్రబాబు తమరికి .. కడప జిల్లాపై అంత కక్ష ఎందుకు?’ అని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి ప్రశ్నించారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమన్నారు. ఇది కడప జిల్లాకు అవమానకరమని, వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండేవని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు.
