సముద్రంలో పిడుగు బోటు పై పడి పోలరాజు అనే యువకుడు మృతి అతని కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని కోరారు విశాఖపట్నం ఇటీవల కాలంలో సముద్రంలో పిడుగు బోటు పై పడి 23 సంవత్సరాల దుమ్ము పోలరాజు అనే యువకుడు మృతి చెందడం జరిగింది ఇంటిని పోషించే కుమారుడు చనిపోవడం కారణంగా అతని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అతని కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారిని (ఆఫ్ డి ఓ ) ఆశాజ్యోతి ని కలిసి సంబంధిత పత్రాలను మృతిని తండ్రి ద్వారా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార నాయకులు చీకటి రమేష్ , విశాఖ కోస్టల్ మేకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్రి కొండబాబు , మైలిపిలి రాము తదితరులు పాల్గొన్నారు.
