Tv424x7
Telangana

కొండచరియలు విరిగిపడి హైదరాబాద్ చెందిన దంపతులు మృతి

ఉత్తరాఖండ్ :-ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షా లు బీభ‌త్సం సృష్టిస్తున్నా యి. కుండ‌పోత వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రి య‌లు విరిగిప‌డుతున్నా యి. ఈ క్రమంలో చ‌మోలీ జిల్లా లో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న‌లో హైద‌రా బాద్‌కు చెందిన ఇద్ద‌రు దంపతులు మృత్యువాత ప‌డ్డారు. మృతుల‌ను నిర్మ‌ల్ షాహీ (36), స‌త్యనారాయ‌ణ (50) గా అక్క‌డి పోలీసులు తెలిపారు. వీరిద్ద‌రూ బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ద్విచ‌క్ర‌వా హ‌నంపై తిరిగి వ‌స్తుంటే మార్గ‌మ‌ధ్యంలో కొండ‌చ‌రి య‌లు వారిపై విరిగి ప‌డ్డాయి. దీంతో వారిద్ద‌రూ అక్క‌డి క‌క్క‌డే ప్రాణాలు కోల్పో యారు. క‌ర్ణ‌ప్ర‌యాగ‌, గౌచ‌ర్ మ‌ధ్య‌లోని బ‌ద్రీనాథ్ నేష‌న‌ల్ హైవేపై శ‌నివారం ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు వివరించారు.

Related posts

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

TV4-24X7 News

తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..!!

TV4-24X7 News

జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్

TV4-24X7 News

Leave a Comment