విశాఖపట్నం పర్యావరణ పరిరక్షణలో భాగంగా, శ్రీ స్వామి వివేకనంద స్వచ్ఛంద సేవా సంస్థ వారు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా గుడ్డ సంచులను, గుడ్డ సంచులతో పాటు కాయగూరలను పంపిణీ చేయడం జరిగింది. మహా అన్నదాన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ముందుగా గోమాతకు నమస్కరించుకొని కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, వివేకానంద సంస్థ వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గురించి తెలుసుకొని, సంస్థకు ఆయన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 10 వేల గుడ్డ సంచులను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన తెలియజేశారు. ప్రముఖులు మరియు సంస్థ సభ్యులు ఎమ్మెల్యే ని, ఘనంగా సత్కరించారు. జనప్రియ అధ్యక్షులు వేణుగోపాల్ , హాస్పిటల్లో భోజనాలు పంపిణీ నిమిత్తం, నెలలో ఏడు రోజుల పాటు భోజనాల పంపిణీకి తమ సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లీడర్ పేపర్ అధ్యక్షులు వి .వి . రమణ మూర్తి, 39వ కార్పొరేటర్ సాదిక్, టీ . డి . పి , బి . జై . పి . జనసేన వార్డు ప్రెసిడెంట్లు సంస్థ అధ్యక్షుల అప్పారావు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

previous post