ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించబోయే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర ఆదివారం తెలిపారు. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నామన్నారు. వర్షాల వల్ల జిల్లాలో ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు సహాయక చర్యల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు

previous post