Tv424x7
Andhrapradesh

వారిపై త్వరలో పరువు నష్టం దావా వేస్తాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అటువంటి వారిపై చర్యలకు పూనుకున్నామని, ఇప్పటికే నోటీసులు పంపామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆయన జెండా ఎగురవేసి మాట్లాడుతూ.. తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై త్వరలో కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు.తనకు కోర్టు నుండి ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదని, అందితే కచ్చితంగా న్యాయపరంగా సమాధానం అందిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసని తెలిపారు. రెండు నెలల్లో ఆరోగ్య శ్రీ పథకానికి రూ.2,500 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని చెప్పారు.త్వరలో ఆరోగ్య శ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారని తెలిపారు. రానున్న రోజుల్లో పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఫీజు చెల్లించి వైద్యం పొందే పరిస్థితి వస్తుందేమోనని అన్నారు.

Related posts

ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

TV4-24X7 News

కలపాకలు ప్రాంతంలో కార్పొరెటర్ విల్లూరి భాస్కరరావు పర్యటన

TV4-24X7 News

పోలవరం పనులు పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం

TV4-24X7 News

Leave a Comment