విశాఖపట్నం రామబాణం కళాశాల ప్రాంగణంలో ఘనంగా అమ్మవారు ఊరేగింపు మహోత్సవం రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన దక్షణ ప్రజలకు మేలు జరగాలి ఇప్పటికీ ఎమ్మెల్యే గానే ఆదరిస్తున్న వారి ప్రేమకు రుణపడి ఉంటా దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తల్లిదండ్రుల దీవెనలతో ఉన్నత ఉద్యోగం సాధించినప్పటికీ ఈ స్థాయికి ఎదగడానికి శ్రీ కనకదుర్గమ్మ కటాక్షమేనని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 104 లోగల వైజాగ్ డిఫెన్స్ అకాడమీ, రామబాణం కళాశాల ప్రాంగణంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ముగింపు, ఊరేగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. 9 రోజుల ప్రత్యేక పూజలతో పాటు, నిత్య హోమం వైభవంగా జరిగింది. వాసుపల్లి గణేష్ కుమార్, ఉషా రాణి దంపతులు, కుమారుడు సూర్య, సౌందర్య రాశి, దంపతులు, అలాగే వాసుపల్లి మాతృమూర్తి అమ్మాజీ చిన్న కుమారుడు సాకేత్, కళాశాల సిబ్బంది అందరూ బుధవారం ఉదయం జరిగిన హోమంలో పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మ ను ఆరాదిస్తూ ధూప దీప నైవేద్యాలతో పాటు అనేక రకాల పళ్ళు, ఫలహారాలు, వివిధ రకాల స్వీట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూజలో పాల్గొన్న వారందరికీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐదు ప్రాంతాలలో ఐదు కళాశాలాలు, 5వేల మంది సిబ్బంది, వేలాది మంది విద్యార్థులు, 11,500 తమ కళాశాల నుండి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు డిఫెన్స్, నేవి, ఆర్మీ, తదితర సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించి, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ రామబాణం లాంటి విజయవంతమైన కళాశాలలో నడుస్తున్నాయంటే ఆ దుర్గమ్మ ఆశీస్సులతోనే అన్నారు. 30 ఏళ్లుగా దసరా ఉత్సవాలు చేస్తూ అమ్మవారిని క్రమం తప్పకుండా ఆరాధిస్తున్నామన్నారు. తనని రెండుసార్లు ఎమ్మెల్యేగా దీవించిన దక్షిణ ప్రజలు ఏప్పుడూ సుఖ సంతోషాలతో అమ్మవారి కరుణ కటాక్షం ఉండాలన్నారు. ఇప్పటికీ తనని ఎమ్మెల్యే గా అనుకుని, వివిధ సమస్యలు సాయం కోసం వస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే గానే చూస్తున్న తన దక్షణ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సీఎంగా కోరుకుంటున్న జగనన్న 2025 జమిలి ఎలక్షన్లో అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారని అమ్మవారి పాదాలు ముద్దాడి చెబుతున్నానని స్పష్టం చేశారు. వంద రోజులు గడిచిన ప్రజలకు ఏమి చేయలేని కూటమి ప్రభుత్వం రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు ఎన్నో పథకాలు నేరుగా వారి అకౌంట్ల లోకి చెరవేసి ఆదుకున్న జగనన్న పై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ ప్రజలు జగనన్న ఉంటే వారి పిల్లలకు అమ్మ ఒడి, అక్క చెల్లెమ్మలకు ఆసరా, ఆటో కార్మికులకు అండగా 10,000 వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుకునే వాళ్లమని వారే చెబుతున్నారన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే బుడమేరు వరద బాధితులకు మూడవ రోజే ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు అందేవని వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఏదేమైనా కనకదుర్గమ్మ ఆశీస్సులతో మళ్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, వార్డ్ ప్రెసిడెంట్లు కనక రెడ్డి, పీతల వాసు,లండ రమణ, దశమంతుల మాణిక్యాలరావు,ముజీబ్ ఖాన్, సకల భక్తుల ప్రసాద్ అమ్మాజీ,వద్దది దిలీప్, కోన శంకర్,భాను,గనగళ్ల రామరాజు, చింతూకాయల వాసు, కళాశాల సిబ్బంది, దక్షిణ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

next post