విశాఖపట్నం వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్ పేద మహిళలకు, శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. వివేకానంద సంస్థ వారు నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్లో చదువుతున్న విద్యార్థులు కోలాటం మరియు నృత్య ప్రదర్శనలను చక్కగా ప్రదర్శించిన విద్యార్థులకు, ప్రతిరోజు తల్లితండ్రులకు పాదాభివందనం చేస్తున్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను చక్కగా పాటిస్తూ చక్కటి మార్గంలో నడిపిస్తున్న వివేకానంద సంస్థ వారిని, ట్యూషన్ విద్యార్థులను అభినందించారు. అనంతరం చికెన్ కర్రీ తో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు పైడిరాజు, అప్పలకొండ సంస్థ మహిళ సభ్యులు ఉమాదేవి, కనకమహాలక్ష్మి, రాణి, సుజాత, ధనలక్ష్మి మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

next post