విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నగర ప్రజల భద్రత దృష్ట్యా మరియు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ప్రతి రోజు పోలీసు అధికారులు మరియు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, వాహనాలు తనిఖీ చేస్తూ, అపరిచితలను, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను విచారిస్తూ, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు.
