విశాఖపట్నం ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న విశాఖ దక్షిణ వైసీపీ ఇన్‌చార్జి, వాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శుక్రవారం మరో సాయానికి ముందుకొచ్చారు. జీవీఎంసీ 37వ వార్డు జాలరి పేట కు చెందిన బుంగ ముత్యాలమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమె వైద్య ఖర్చులకు సంబంధించి వాసుపల్లి రూ.5,000 వేల ఆర్థిక సాయం అందజేసి ఆదుకున్నారు. ఆశీలుమెట్ట కార్యాలయంలో ఈ మేరకు బాధితురాలకు నగదు అందజేసి భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కష్టంగా ఉన్న తరుణంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి రావడంతో సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో 27 వార్డు అధ్యక్షులు సర్వేశ్వర్ రెడ్డి, నీలం వేప చెట్టు మాజీ చైర్మన్ బొరా విజయలక్ష్మి , బోరా శ్రీనివాసరావు , గనగల్ల రామరాజు , చింతకాయల వాసు, ఆకుల శ్యామ్, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

previous post