విశాఖపట్నం కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా, వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో గాయత్రి హోమం నిర్వహించి, ఓంకార రూపంలో దీపాలను వెలిగించి భక్తితో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, కార్తీక మాసం మొదలు ప్రతి సోమవారం భక్తిశ్రద్ధలతో గాయత్రి మంత్రం పటిస్తూ గాయత్రి హోమం నిర్వహించి, సంకీర్తనలు చేస్తూ, దీపాలను వెలిగించి ఆధ్యాత్మికతను అలవర్చుకున్న ట్యూషన్ విద్యార్థులను ఆయన అభినందించారు. సంస్థ సభ్యులు పి . నల్ల రాజు, కనకమహాలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో నామ సంకీర్తనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.
