Tv424x7
Andhrapradesh

విశాఖలో మృతదేహం కలకలంకాలికి రాయి కట్టేసి గోనె సంచిలో పెట్టేసిహత్యగా పోలీసుల అనుమానం

విశాఖపట్నం విశాఖలో 37ఏళ్ల పురుషుడి మృతదేహం మంగళవారం కలకలం రేపింది. చిన్న మార్బుల్ పలక ఉన్న ఓ గోనె సంచి (వలతో) లో మృతదేహాన్ని నైలాన్ తాడుతో కట్టేసి ఉండడంతో ఇది కచ్చితంగా హత్యగానే పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లోని 10వ నంబర్ జెట్టీకి మృతదేహం కొట్టుకు రావడం సంచలనమైంది. సినీ ఫక్కీలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంద్రంలో మృతదేహం తేలుతూ ఉండడాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించి విశాఖ వన్టైన్ పోలీసులకు సమాచారమందజేశారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండడంతో దుర్వాసన వస్తోంది. సంచిలోంచి మృతదేహాన్ని బయటకి తీసి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలసిన దాసుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

TV4-24X7 News

ఏపీ లో 12 యేళ్ల తర్వాత మారనున్న ఇంటర్‌ సిలబస్‌

TV4-24X7 News

ముక్కలుగా మారిన మంగళగిరి వైఎస్సార్​సీపీ – ఆదిపత్యపోరుతో పెరుగుతున్న అసమ్మతి

TV4-24X7 News

Leave a Comment