ఖాజీపేట మండలం, దుంపలగట్టు గ్రామం: గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వనం సంజన (18), వనం అర్చన (14) అనే అక్కాచెల్లెళ్లు నీటి గుంతలో పడి మృతి చెందారు.కుటుంబ జీవనాధారమైన పందుల పెంపకం కోసం తల్లి శివవాణి, తమ్ముళ్లు గౌతమ్, కార్తీక్‌లతో కలిసి పందులను మేపేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నీటి గుంత వద్ద ఉండగా ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు గుంతలో పడి మునిగిపోయారు.సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు.ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమార్తెలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.


