Tv424x7
Andhrapradesh

దువ్వూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహణ

దువ్వూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ మండల కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టి పల్లె రఘురామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలపై ప్రజలకు వివరించారు.కార్యక్రమంలో ఎంపీపీ కానాల జయచంద్ర రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గోపిరెడ్డి బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు తుమ్మల వెంకట కొండారెడ్డి, కోగటం వీరారెడ్డి, కానాల ఓబుల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Related posts

ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలో చేరిన రఫీక్ కుటుంభం మరియు 200 మంది కార్యకర్తలు.

TV4-24X7 News

ఈతకోట గ్రామంలో పలువురిపై దాడికి దిగిన పవన్ కల్యాణ్ అభిమానులు..

TV4-24X7 News

అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. కోడలు ఏమి చేశారో తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment