హనుమకొండ: జిల్లా యేనుగులగడ్డ ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడిగా వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడి నిర్వహించారు.బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో తనిఖీలు చేపట్టిన డీసీఏ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు.తనిఖీల్లో మొత్తం 41 రకాల మందులు లభించగా, వాటిలో 35 రకాల ఇన్స్టిట్యూషనల్ సప్లై మందులు ఉన్నట్లు గుర్తించారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 వేలుగా అంచనా వేశారు.అనుమతి లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని డీసీఏ అధికారులు హెచ్చరించారు. మందుల నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ వెల్లడించింది. అలాగే లైసెన్స్ లేని వ్యక్తులకు, క్వాక్‌లకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది..
previous post

