Tv424x7
Andhrapradesh

మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ

విశాఖపట్నం విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ సూచించారు. సోమవారం మాకవరపాలెం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మత్తు పదార్ధాలు వినియోగం, రవాణా నియంత్రణపై సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. వాటికి బానిసలుగా మారితే జీవితాలు నాశనం అవుతాయన్నారు. కావున మత్తు పదార్ధాలకు బానిసై ప్రాణాల మీదకు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దన్నారు. మత్తు పదార్ధాలకు బానిసైతే ఏర్పడి అనర్ధాలను ఆడియో విజువల్ ద్వారా చూపించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్రావు మాట్లాడుతూ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్తు పదార్ధాలు, వినియోగానికి పాల్పడిన వారి ఆస్తులు జప్తు చేసి చట్టాన్ని తీసుకువస్తున్నారని యువత జాగ్రత్త వహించాలని చెప్పారు. అనంతరం మాకవరపాలెం ఎస్పై దామోదర్ నాయుడు, మత్తు పదార్ధాల వినియోగం నియంత్రణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ అధికారి బి. గణేష్, ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి గోపి, ఏవో డేలియల్ రాజు, 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

బాలికపై లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

TV4-24X7 News

చెడ్డి గ్యాంగ్ ఫొటోలు విడుదల చేసిన ధర్మవరం పోలీసులు.

TV4-24X7 News

ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి.

TV4-24X7 News

Leave a Comment