Tv424x7
Andhrapradesh

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దుండగులు దాడి

దాదాపు 20మంది దాడి చేశారన్న అర్చకులు రెండు రోజుల తర్వాత వెలుగులోకి ఘటన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు వీర రాఘవరెడ్డి. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నిందితుడు వీర రాఘవరెడ్డిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మూడు రోజుల క్రితం తెల్లవారుజామున వీర రాఘవరెడ్డి అనుచ రులు అర్చకులు ఇంట్లోకి చొరబడ్డారు. అంతేకాకుండా.. రంగరాజన్‌పై దూషిస్తూ హల్చల్ చేశారు.కాగా.. ఆలయం సమీపంలోని రంగరాజన్‌ నివాసానికి శుక్రవారం నాడు కొంత మంది వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు రంగరాజన్‌ నిరాకరించారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదు చేశారు.

చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్!

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన మొయినాబాద్ పోలీసులు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

Related posts

కడప అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సెక్షన్ 144….

TV4-24X7 News

సీపీ చేతుల మీదుగా 2,45,000 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం

TV4-24X7 News

మహిళలకు నెలకు రూ.1500.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.

TV4-24X7 News

Leave a Comment