Tv424x7
Andhrapradesh

మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి: సీఎం చంద్రబాబు

ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో నాలుగురోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మరోవైపు రుషికొండ ప్యాలెస్ పై మంత్రులతో సీఎం చర్చించారు. భవనాలను ఏం చేయాలన్న దానిపై చర్చించారు. మొదట మంత్రులంతా ఆ ప్యాలెస్ ను సందర్శించాలన్నారు. ఆ తర్వాత ఏం చేద్దామనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.

Related posts

వాలంటీర్ జీతాలు పెంపు 5 వేల నుంచి రూ.5,750

TV4-24X7 News

అందుకే ఏపీసీసీ పదవికి రాజీనామా చేశా..

TV4-24X7 News

పవన్ తో జగన్ కి పోలిక ఏంటీ..పవన్ కి అంత సీన్ లేదు: ఉండవల్లి

TV4-24X7 News

Leave a Comment