అమరావతి :ఏపీలోని ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, చేసిన అప్పులు తీర్చలేక పోతున్నామని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరింది.

previous post