Tv424x7
Andhrapradesh

ఈ నెల 7 న శ్రీశైలం గుడి మూసివేత, 8న తిరిగి స్వామి దర్శనం ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను, ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 7 వ తేది న స్వామి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, ఆదిదంపతుల కళ్యాణోత్సవం పూర్తిగా నిలిపివేశారు. ఆరోజున అలంకార దర్శనం మాత్రమే భక్తులందరికీ అవకాశం . సాక్షి గణపతి, హఠ కేశ్వరం, పాల ధార, పంచదార, శిఖ రేశ్వరం, తదితర పరివారా ఆలయ ద్వారాలను కూడా మూసివేస్తారు. సెప్టెంబర్ 8 న ఉదయం ఐదు గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి, ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరిపించిన తర్వాత ప్రాతః కాలం పూజలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల కు మంగళ హారతులు జరిపిస్తారు. మంగళ హారతుల సమయం నుంచి అనగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు స్వామి అలంకార దర్శనం కల్పిస్తారు. సెప్టెంబర్ 8 వ తేదీ నాటికి ఆన్ లైన్ లో స్వామి స్పర్శ దర్శనం, , విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీ స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు. తిరిగి సాయంకాలం ఐదున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అలంకార దర్శనాలు కొనసాగుతాయి.

Related posts

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

TV4-24X7 News

చంద్రుడి పై నాసా భారీ ప్లానింగ్ ఏంటో తెలుస్తే షాక్

TV4-24X7 News

సోమ, మంగళవారాల్లో పిఠాపురంలో పవన్ పర్యటన.. షెడ్యూల్

TV4-24X7 News

Leave a Comment