Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది

జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్‌, అదే నెలలో ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయబోతోంది.ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ లేఖలో తెలిపారు.ప్రస్తుత సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగుస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో.. నగరపాలక (కార్పొరేషన్లు), పురపాలక (మున్సిపాలిటీలు), నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగుస్తుంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టం (మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955 ప్రకారం సాధారణ స్థానికసంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే మూడు నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుంది)లో ఉంది. అందుకే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని SEC భావిస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రాసిన లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ ఇలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను 2025 అక్టోబరు 15లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అక్టోబరు 16 నుంచి నవంబరు 15లోగా సిద్ధం చేసి, ప్రచురించాలి. ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబరు 1 నుంచి 15లోగా పూర్తి చేయాలి. పోలింగ్‌ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి నవంబరు 16 నుంచి 30లోగా పూర్తి చేయాలి. రిజర్వేషన్లు డిసెంబరు 15లోపు ఖరారు చేయాలి. రాజకీయ పార్టీలతో డిసెంబరు చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్‌, అదే నెలలో ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేశారు. గ్రామ పంచాయతీలకు 2026 జనవరి నుంచి.. జులై నుంచి ఎంపీటీసీ/జెడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారట. మొత్తం మీద వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts

అప్పన్నను దర్శించుకున్న వాసుపల్లి ఫ్యామిలీ

TV4-24X7 News

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

TV4-24X7 News

సాగునీటి సంఘాల ఎన్నికల్లో మంత్రి ఫరూక్ పట్టు

TV4-24X7 News

Leave a Comment