Tv424x7
Telangana

గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌: పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌-గోమ్టినగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు.

చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 28 నుంచి నవంబరు 2వరకు ప్రతి సోమవారం గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ (05314) మధ్య 6 ప్రత్యేక రైళ్లు, ఈనెల 29 నుంచి నవంబరు 3 వరకు ప్రతి ఆదివారం మహబూబ్‌నగర్‌-గోమ్టినగర్‌ (05313) మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపారు.

ఈ రైళ్లు వచ్చి వెళ్లేప్పుడు బారబంకి, బుర్హవాల్‌, గొండ బస్తీ, గోరక్‌పూర్‌, దోరియాసదర్‌, భట్ని, మౌ, ఔన్‌రిహర్‌, వారణాసి, మీర్జాపూర్‌, ప్రయాగ్‌రాజ్‌, మణిక్‌పూర్‌, సత్నా, కట్ని, జబల్‌పూర్‌, బాలఘాట్‌, గోండియా, బల్హార్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, రామగుండం, కాజీపేట, మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల స్టేషన్‌లలో ఆగుతాయని పేర్కొన్నారు.

Related posts

*సంక్రాంతి పండుగకు తెలంగాణలో ప్రత్యేక బస్సులు

TV4-24X7 News

ఖరీఫ్ వరి ధాన్యానికి రూ..2680

TV4-24X7 News

రాజస్థాన్ కు చెందిన సైబర్‌ నేరస్థుడు అరెస్టు

TV4-24X7 News

Leave a Comment