Tv424x7
Andhrapradesh

అబంటి రాంబాబు పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

అమరావతి:మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై అవినీతి ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.సమాచారం ప్రకారం, జగనన్న కాలనీల భూముల కొనుగోలు ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల నియామకాల విషయంలో డబ్బు తీసుకుని నియామకాలు జరిగాయన్న ఆరోపణలు కూడా వెలువడ్డాయి. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలి అని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.రాష్ట్రంలో అవినీతి కేసులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రిగా, అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న అంబటి రాంబాబు పేరు అవినీతి ఆరోపణల్లో రావడం వల్ల వైసీపీకి ఇది పెద్ద ఇబ్బందిగా మారే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో, విజిలెన్స్ నివేదిక ఏం చెబుతుందో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.

మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

Related posts

మారుతున్న విశాఖ నగర మేయర్ పీఠం

TV4-24X7 News

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

TV4-24X7 News

జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు అన్నదమ్ముల్లా కలసి పనిచేస్తాం

TV4-24X7 News

Leave a Comment