Tv424x7
Telangana

మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు..పొట్టుగా కొట్టుకున్నారు….. ఎందుకో తెలుసా…..

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం….జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం….కానీ *మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో యూరియా బస్తాల కోసం * ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయపరిచింది.

చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా కొట్టుకున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలను బలవంతంగా ఆపారు.

మహబూబాబాద్ పట్టణం లోని వివేకానంద సెంటర్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు , పురుషులు ఆధార్ కార్డు జిరాక్స్ లు పట్టు కొని పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలోనే ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వాట్సప్ లో వైరల్ గా మారాయి.

సేకరణ : రజిత

Related posts

రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

TV4-24X7 News

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

TV4-24X7 News

తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావం…

TV4-24X7 News

Leave a Comment