కడప బీటెక్ విద్యార్థి ఘరానా మోసం.. రూ.1.50 కోట్ల వసూళ్లు..!
కడప జిల్లాకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి ఉద్యోగాల పేరుతో తోటి విద్యార్థులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయ్ నరసింహ అనే విద్యార్థి నీరుకొండలోని SRM University AP లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.
తనకు చెందిన FX స్టార్టప్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి తోటి విద్యార్థుల నుంచి సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసం బయటపడటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం తెలిపిన వివరాల మేరకు, సుమారు 30 మంది బాధితులు శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.

