. కూతురితో కలిసి కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద “ఆదుకోండి.. లేక చంపేయండి” అంటూ రోడ్డుపై వెళ్తున్న ప్రజలను వేడుకుంటూ కనిపించిన ఘటన కలకలం రేపింది.స్థానికుల సమాచారం మేరకు, పావలా శ్యామల – ఆమె కుమార్తె తీవ్ర ఆవేదనతో సహాయం కోరుతూ కనిపించడంతో కొందరు స్పందించి వారిని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. అనంతరం ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం.ఇటీవల తిరుమలగిరి చౌరస్తాలో కూడా బస్సు ముందు వెళ్లి “చచ్చిపోతా” అంటూ హల్‌చల్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆశ్రమంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి తిరిగి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పావలా శ్యామలకు సినీ పరిశ్రమ నుంచి సహాయం అందినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.— ప్రతినిధి

