తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల వివరాలను ప్రకటించింది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాల్లో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.మే 18న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలసుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను మే 18 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు మే 20 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపికైన భక్తులు మే 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపు పూర్తి చేస్తే టికెట్లు మంజూరు అవుతాయి.మే 21న ఇతర ఆర్జిత సేవలు, పవిత్రోత్సవ టికెట్లుకల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను మే 21 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే ఆగస్టు 23 నుంచి 25 వరకు జరిగే వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను కూడా అదే రోజు విడుదల చేస్తారు.వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లువర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను మే 21 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను మే 23 ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు.శ్రీవాణి, వృద్ధులు-దివ్యాంగుల దర్శన కోటాశ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను మే 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను మే 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.మే 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటాప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 25 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మే 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు: టీటీడీ అధికారిక వెబ్‌సైట్�టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఈ ప్రకటన విడుదల చేశారు.

