Tv424x7
Andhrapradesh

కర్నూలు ట్రాఫిక్ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగింపు

హరిప్రసాద్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. నంద్యాల జిల్లాలో ఎక్కువకాలం పనిచేసిన ఆయన పేరు గతంలోనే పలు వివాదాల్లో వినిపించింది.గతంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ తనను ఎస్సై వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ వీడియో మంత్రి Nara Lokeshకు చేరడంతో అప్పట్లో డీజీపీ స్పందించి హరిప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయబడగా చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించారు.ఇటీవల కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయిన హరిప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ యువతితో సన్నిహితంగా ఉండి, తర్వాత వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. వ్యక్తిగత ఫోటోలను యువతి పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి పంపడంతో వివాహం ఆగిపోయిందని ఆరోపణలు ఉన్నాయి.యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, ఆరోపణల్లో నిజం ఉన్నట్లు తేలడంతో ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Related posts

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

వర్రా అసభ్యకర పోస్టులు.. తాడేపల్లి కార్యాలయం నుంచే: డీఐజీ ప్రవీణ్‌..

TV4-24X7 News

అరబిందో కక్కుర్తి – అంబులెన్స్ సేవల్లోనూ దోపిడీనే !

TV4-24X7 News

Leave a Comment