Tv424x7
Andhrapradesh

బద్వేల్‌లో టీడీపీలో వర్గ పోరు.. సీసీ రోడ్డు పనుల వద్ద ఉద్రిక్తత

వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వర్గ పోరు మరోసారి బయటపడింది. టీడీపీ ఇంచార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు తెలుగు గంగ కాలనీ రోడ్డులో సీసీ రోడ్డు పనులను సూర్యనారాయణ రెడ్డి వర్గం చేపట్టింది. అయితే పనులు జరుగుతున్న సమయంలో రితీష్ కుమార్ రెడ్డి వర్గం అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసుల జోక్యంతో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.ఇదిలా ఉండగా, అభివృద్ధి పనులను అడ్డుకుంటే సహించేది లేదంటూ స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. “చెప్పులు, పొరకలతో బుద్ధి చెబుతాం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత నెల రోజుల క్రితం కూడా ఇదే పనిని రితీష్ కుమార్ రెడ్డి వర్గం అడ్డుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బద్వేల్ టీడీపీలో కొనసాగుతున్న వర్గపోరు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Related posts

సంగం పరిసరాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..

TV4-24X7 News

అటవీ ప్రాంతంలో భారీ గోడౌన్ – వెలుగులోకి ‘రేషన్’ మోసం!!

TV4-24X7 News

గేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్

TV4-24X7 News

Leave a Comment